schedule Monday, August 24, 2026

calendar_today May 1, 2024
person meenewstelugu

ఘనంగా ఆర్. సి.గౌడ్ జన్మదిన వేడుకలు

-ఆర్.సి. గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపిన :మాజీ ఎమ్మెల్యే -బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు

దీక్షతెలుగు, న్యూస్ :

తాండూరు మండల బీఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు,మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చేరుకున్నారు. ఆర్. సి.గౌడ్ నివాసంలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, బీఆర్​ఎస్​ నాయకులు, కార్యకర్తలు ఆర్. సి.గౌడ్ ని సత్కరించారు.మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్ ముఖ్యఅనేతల మద్య ఆర్. సి. గౌడ్ కేక్ కట్ చేశారు. పైలెట్ రోహిత్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, ఆర్. సి.గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, రాజప్ప గౌడ్, వెంకటేశం,నాయకులు, పాల్గొన్నారు.