schedule Tuesday, August 25, 2026

మండల వాసికి డాక్టరేట్ 

calendar_today December 1, 2024
person meenewstelugu
మండల వాసికి డాక్టరేట్ 

మండల వాసికి డాక్టరేట్ 

మోతె..మీ న్యూస్  ప్రతినిధి డిసెంబర్ 1 మండల పరిధిలోని రాఘవపురం ఎక్స్ రోడ్ గ్రామానికి చెందిన గునగంటి స్రవంతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కేఎల్ విశ్వవిద్యాలయంలో 14వ స్నాతకోత్సవం సందర్భంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో డాక్టరేట్ అందుకున్నట్లు ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. ఆమె ప్రస్తుతం మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్ పనిచేస్తున్నారు.గునగంటి స్రవంతి డాక్టరేట్ అందుకోవడం పట్ల కుటుంబ సభ్యులు మండవ కార్తీక్ , వెంకన్న, జయలక్ష్మి, కోల రవీందర్, గ్రామస్తుల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినందించారు