schedule Sunday, August 30, 2026

ఉపాధ్యాయుల సర్దుబాటును నిబంధన ప్రకారం చేయాలి.TPTU.

calendar_today November 19, 2024
person meenewstelugu
ఉపాధ్యాయుల సర్దుబాటును నిబంధన ప్రకారం చేయాలి.TPTU.

ఉపాధ్యాయుల సర్దుబాటును నిబంధన ప్రకారం చేయాలి.TPTU.

   

మీ న్యూస్ ప్రతినిధి :: ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్ల తదుపరి మెజారిటీ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అయినప్పటికీ విద్యార్థుల సంఖ్య అనుగుణంగా కొన్ని పాఠశాలల్లో సబ్జెక్టుల వారిగా ఉపాధ్యాయుల కొరత ఉన్నదని.. అట్టి పాఠశాలలకు నిబంధనల ప్రకారం ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలని టి పి టి యు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ ,ప్రధాన కార్యదర్శి కడపర్తి శ్రీనివాస్ నాయుడు జిల్లా విద్యాశాఖ అధికారిని కోరారు.*.. జూన్ 2024 లో జరిగిన ఉపాధ్యాయుల బదిలీలలో SPOUSE POINTS ద్వారా నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగ్ పొందిన ఉపాధ్యాయులపై రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాలలో చర్యలు తీసుకున్నారని, సూర్యాపేట జిల్లాలో కూడా విచారణ చేపట్టి స్పౌస్ పాయింట్స్ ను దుర్వినియోగం చేసిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో టిపిటియు వివిధ మండలాల బాధ్యులు A. రమేష్ ,A.హరికృష్ణ, బుర్రి శ్రీనివాస్ ,V.శ్రీనివాస్ రెడ్డి ,S.రమేష్,M. ఉదయ్ కుమార్, వరిపల్లి అంజయ్య కాసర్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు