schedule Monday, August 31, 2026

ఆధ్యాత్మికతో మానసిక ప్రశాంతత లభిస్తుంది

calendar_today November 8, 2024
person meenewstelugu
ఆధ్యాత్మికతో మానసిక ప్రశాంతత లభిస్తుంది

ఆధ్యాత్మికతో మానసిక ప్రశాంతత లభిస్తుంది

   

 మీ న్యూస్ ప్రతినిధి 

మోతె: ఆధ్యాత్మికతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని నరసింహపురం గ్రామంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణ శంకుస్థాపనలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి భావం కలిగి ఉండాలని, భక్తితో మనసుకు ప్రశాంతత లభిస్తుందని, స్వామివారు గ్రామస్తులను పాడి, పంటలతో చల్లగా చూడాలని ఆమె వేడుకున్నారు. ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తుందని ఆమె తెలిపారు. దేవస్థానం కమిటీ సభ్యులు ఆమెకు ఘన స్వాగతం తెలిపారు. భజన కీర్తనలతో వచ్చిన భక్తులను భజన సభ్యులు అలరించారు. వచ్చిన భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, మండల పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఎం. ఆశా, మాజీ జెడ్పిటిసి పి. పుల్లారావు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు