schedule Sunday, August 30, 2026

పెంటయ్య కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన గ్రామస్తులు..

calendar_today October 23, 2024
person meenewstelugu
పెంటయ్య కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన గ్రామస్తులు..

పెంటయ్య కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన గ్రామస్తులు..

మీ న్యూస్ నూతనకల్ ప్రతినిధి: మండల పరిధిలోని దిర్శనపల్లి గ్రామానికి చెందిన గంట పెంటయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.వీరు గతంలో 30 సంవత్సరాలు గ్రామపంచాయతీ వర్కర్ గా పనిచేశారు. పెంటయ్యది నిరుపేద కుటుంబం కావడంతో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న విషయాన్ని గ్రామస్తులు తెలుసుకొని వారి కుమారులైన గంట వీరయ్య, గంట వెంకన్న లకు 16 వేల రూపాయలను ఆర్థిక సహాయంగా బుధవారం అందజేశారు.ఈ కార్యక్రమంలో గంట నాగయ్య, రవిశంకర్,రామకృష్ణ,రాచకొండ అయోధ్య,పాండవుల లింగయ్య, గంట మధుసూదన్,పిల్లలమర్రి అశోక్,మధుకర్,లింగరాజు, రామస్వామి,నరేష్,గోపయ్య, మల్సూరు,హరికృష్ణ,వీరయ్య, సోమలింగయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ న్యూస్ ప్రతినిధి అనంతుల చంద్రయ్య