schedule Wednesday, August 26, 2026

ఘనంగా ముందస్తు దుర్గాష్టమి, విజయదశమి ఉత్సవాలు

calendar_today October 1, 2024
person meenewstelugu
ఘనంగా ముందస్తు దుర్గాష్టమి, విజయదశమి ఉత్సవాలు

ఘనంగా ముందస్తు దుర్గాష్టమి, విజయదశమి ఉత్సవాలు

నూతనకల్ మీ న్యూస్ ప్రతినిధి చంద్రయ్య ::మండల కేంద్రంలోని నాగార్జున ఉన్నత పాఠశాలలో మంగళవారం ముందస్తు దుర్గాష్టమి, విజయదశమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులచే దుర్గామాత అవతారాలను తెలియజేసే వేషధారణలను వేసి ప్రదర్శించడంతో పాటు రావణాసురుని వద, మహిషాసురుని వద, వంటి రూపకల్పన దృశ్యాలను ప్రదర్శింప చేశారు.అనంతరం చిన్నారులచే బొమ్మల కొలువు ఏర్పాటు చేయడంతో పాటు రంగురంగుల పువ్వులచే బతుకమ్మలను పేర్చి గౌరీమాతను నెలకొల్పి పాఠశాల ప్రాంగణంలో కోలాటాలు వేస్తూ ఉయ్యాలలు ఊగారు.ఈ ప్రదర్శనలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మారగాని వెంకట్ గౌడ్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు,తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేసే దిశగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులంతా మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల గౌరవభావాలు పెంపొందించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు మారగాని విజయలక్ష్మి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు గుర్రం యాదగిరి గౌడ్,బిక్కి రామన్న గౌడ్,మతిన్, యశ్వంత్,రాజేశ్వరి,సౌమ్య, రాజేశ్వరి,మౌనిక,అనూష,నవ్య, యాస్మిన్,సునీత,ప్రియాంక, హేమలత,పావని,విద్యార్థిని విద్యార్థులు,తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.