schedule Thursday, August 27, 2026

సమాచారం అడిగితే చిర్రుబొర్రులాట

calendar_today October 1, 2024
person meenewstelugu
సమాచారం అడిగితే చిర్రుబొర్రులాట

సమాచారం అడిగితే చిర్రుబొర్రులాట

సామాన్యులు అంటే ఆ అధికారిణికి గిట్టదు

ఉన్నతాధికారుల సూచనలు బే ఖాతరు

విస్మయం వ్యక్తం చేస్తున్న మండల రైతులు

మీ:: న్యూస్ ప్రతినిధి కోల రవీందర్ గౌడ్ 

 మోతె,: మండల వ్యవసాయ అధికారిణి వ్యవహార శైలితో మండలంలోని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏదైనా సమాచారం కోసం మండల వ్యవసాయ అధికారిణిని సంప్రదించి రైతుల ఏదైనా సమాచారం అడిగినట్లయితే సదరు అధికారిణి రైతుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఎక్కువ మాట్లాడితే కేసులు పెడతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నది. సామాన్య రైతులు ఎవరైనా ఆ అధికారి దగ్గరికి వెళ్లాలంటేనే భయబ్రాంతులకు గురవుతున్నారు. ఎరువుల దుకాణాల వివరాలు ఇవ్వవలసిందిగా మండల వ్యవసాయ అధికారిణిని కోరడం జరిగింది. దీంతో సదరు అధికారిని ముందుగా తమ పై అధికారులను సంప్రదించాలని సూచించారు. ఆమె సూచన మేరకు ఏడిఏను సంప్రదించగా మీ మండలంలోని ఇప్పిస్తానని తెలియజేశారు. ఏడీఏ సూచనలతో శనివారం మండలంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో వివరాలు అడిగి ఎందుకు వెళ్ళగా అక్కడే ఉన్న మండల వ్యవసాయ అధికారిణి ని సమాచారం ఇవ్వకపోగా సమాచారం ఇవ్వమని చెప్పిన పై అధికారులను అసభ్య పదజాలంతో దూషించడం శోచనీయం. అధికారి గతంలో కూడా ఉన్నత అధికారులపై తప్పుడు ఫిర్యాదులు చేసి అనేక ఇబ్బందులకు గురి చేసినట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సామాన్య రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న మండల వ్యవసాయ అధికారిని ఇక్కడి నుండి బదిలీ చేసి ఒక మంచి అధికారిని మోతె మండలానికి కేటాయించాలని మండల రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.