schedule Thursday, August 27, 2026

జోరుగా... మట్టిదందా యధేచ్ఛగా అక్రమ తవ్వకాలు

calendar_today September 28, 2024
person meenewstelugu
జోరుగా... మట్టిదందా   యధేచ్ఛగా అక్రమ తవ్వకాలు

జోరుగా... మట్టిదందా

యధేచ్ఛగా అక్రమ తవ్వకాలు

పట్టించుకోని అధికారులు

ఏటా ఇదే తంతు.. అక్రమాలకు అడ్డేది

ఆనవాళ్లు కోల్పోయిన పాఠశాల దారి

  మీ::న్యూస్ సూర్యా పేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్::సూర్యా పేట జిల్లా కేంద్రంలోని దూరాజ్ పల్లి నుoడి గరిడేపల్లి వెళ్లే రహదారి దగ్గర, మోడల్ స్కూల్ పక్కన,గుట్టపైన  యధేచ్ఛగా అక్రమ తవ్వకాలు మట్టిదందా నడుస్తుంది. పక్కనే పాఠశాల, భారీ శబ్దలతో మట్టి దందా నడుస్తున్నడంతో పాఠశాల విద్యార్థుల కు ఇబ్బందికరంగా మారుతుంది. కొద్దిరోజులుగా మట్టి దందా జరుగుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరం.జిల్లా ఉన్నతాధికారులు మట్టి తవ్వకాలపై దృష్టి సారించకపోవడంతో అక్రమార్కులు యధేచ్చగా అక్రమ మట్టి తవ్వాకాలు జరుపుతున్నారు.