నిధులు లేవు ఎట్లా*?..పంచాయతీ కార్యదర్శుల పై పని భారం..
calendar_today
September 27, 2024
person
meenewstelugu
నిధులు లేవు ఎట్లా*?..పంచాయతీ కార్యదర్శుల పై పని భారం..
మీ 31 న్యూస్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్::నిధులు లేవు ఎట్లా పంచాయితీ కార్యదర్శులపై పనిభారం తో ఇబ్బందులు పడుతున్నారు అధికారుల ఒత్తిడికి తోడు ఉదయం సాయంత్రం తేడా లేకుండా పనులు అప్పగించడంతో మనోవేదనకు లోనై సతమతమవుతున్నారు బి ఎల్ వోలు నిర్వహించాల్సిన ఓటరు జాబితా విధులు కూడా కార్యదర్శులకు అప్పజెప్పిన పూర్తి చేసినారు. వీరిపై పనుల భారం తో పాటు నిధుల కొరత సొంతంగా పెట్టుబడులు పెట్టడం అప్పులు చేసి పిల్లల సదువులు కుటుంబం పోషణ నడవక దివాలు తీస్తున్నారు. ఇది సాలదన్నట్లు మండల జిల్లా కార్యాలయాల అధికారుల వేధింపులు ఇటీవల ఎక్కువయ్యాయని ఆరోపణలు ఉన్నాయి దీంతో చేసేదేమి లేక వివిధ కారణాలు చూపుతూ కొందరు సెలవు పై వెళుతుండగా ఉన్న వారిపై అదనపు బాధ్యతలు పడుతున్నాయి పని భారం మానసిక ఒత్తిడితో సతమతమవుతూ విధులు నిర్వహించడం కష్టo కష్టంగా మారిందని పలువురు కార్యదర్శులు వాపోతున్నారు ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా సామూహిక సెలవులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం ఉదయం ఏడు గంటలకే క్షేత్రస్థాయి నుంచి డైలీ శానిటేషన్ కోర్టు (డి ఎస్ ఆర్) పంపించాలి నిత్యం మురుగు కాలువ ల శుభ్రం, వీధి దీపాల నిర్వహణ, ఇంటి పన్నుల వసూళ్లు, రోడ్లు పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డ్లు, వైకుంఠ దామాలు, ఉపాధి హామీ, నర్సరీ, మొక్కల పరిరక్షణ, గ్రామీణ నీటి సరఫరా, ఓటర్ లిస్ట్ తయారీ ఇలా అన్ని చోట్లకి వెళ్లి ఫోటో దిగి ప్రత్యేక యాప్ లో పోస్ట్ చేయాలి, ఈ విషయములో కొందరు ఎంపీడీవోలు ఎం పి ఓ లకు పంచాయతీ కార్యదర్శులకు మధ్య వివాదాలు తలుతూ ఉన్నాయి జీతాలు ఇవ్వడం లేదని పారిశుద్ధ్య కార్మికులు విధులకు నిరాకరిస్తుండటంతో కార్యదర్శులు ఆందోళనకు తప్పని పరిస్థితి. అత్యవసర పనులకు కార్యదర్శుల పెట్టుబడి
సర్పంచుల పదవీకాలం ముగియడం. పంచాయతీలకు ఖజానా ఖాళీగా ఉండడం. సిబ్బందికి కొన్ని నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో నీటి సరఫరా, పారిశుద్ధ్య ఇతర ఇతర పనులకు వారు ముందుకు రావాలంటే ఇబ్బంది పడుతున్నారు దీంతో పాటుగా గ్రామంలో అత్యవసర పనులకు కార్యదర్శిలు జేబు నుంచి చెల్లించాల్సి వస్తుంది ఇప్పటికే కార్యదర్శులు ఒక్కో పంచాయతీలు లక్ష నుంచి రెండు లక్షలు మేజర్ పంచాయతీల్లో ఐదు లక్షల వరకు వివిధ పనుల నిమిత్తం ఖర్చు చేసినట్లు చెప్తున్నారు..