schedule Sunday, August 23, 2026

తెలంగాణ అథ్లెటిక్స్ అండర్16 విభాగం లో గోల్డ్ మెడల్ 

calendar_today September 22, 2024
person meenewstelugu
తెలంగాణ అథ్లెటిక్స్ అండర్16 విభాగం లో గోల్డ్ మెడల్ 

తెలంగాణ అథ్లెటిక్స్ అండర్16 విభాగం లో గోల్డ్ మెడల్ 

---నేషనల్ సౌత్ జోన్ కు ఎంపిక 

---కోదాడ పట్టణంలోని ఎస్ ఆర్ ఎమ్ పాఠశాల

మీ:: న్యూస్ ప్రతినిధి మోతె:హైద్రాబాద్ లో ఓ యు క్యాంపస్ లో ఈ నెల 19 న నిర్వహించిన తెలంగాణ అథ్లెటిక్స్ అండర్16 విభాగం లో 60 మీటర్ల పరుగు పందెం లో మోతె మండల కేంద్రానికి చెందిన విద్యార్థి అప్పల వరుణ్ గోల్డ్ మెడల్ సాధించాడు.దీంతో పాటు నేషనల్ సౌత్ జోన్ కు ఎంపికైనట్లు తెలిపారు. అప్పల వరుణ్ కోదాడ పట్టణం లోని ఎస్ ఆర్ ఎమ్ పాఠశాల లో పదవ తరగతి చదువుతున్నాడు.గోల్డ్ మెడల్ సాధించడం తో తల్లిదండ్రులు, గ్రామస్తులు, పాఠశాల ఉపాధ్యాయులు, అభినందించారు.