జమిలి ఎన్నికల విధానాన్నికేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం సరైన విధానం కాదు
calendar_today
September 19, 2024
person
meenewstelugu
జమిలి ఎన్నికల విధానాన్నికేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం సరైన విధానం కాదు
----ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం
----సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి
మీ:: న్యూస్ ప్రతినిధి
సూర్యాపేట:జమిలీ ఎన్నికల విధానానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం సరైన విధానం కాదు అని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి గురువారం ఒక ప్రకటనలో అన్నారు. 2029 నుంచి ఒకే దేశం- ఓకే ఎన్నిక విధానాన్ని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్ లో ప్రవేశపెట్టడం ఫెడరల్ స్ఫూర్తికివిరుద్ధమన్నారు. దేశంలో ప్రతిపక్ష పార్టీలన్నీ జమిలి ఎన్నికల పద్ధతి అనుకూలం కాదు అని చెప్తు వస్తున్నప్పటికీ బిజెపి ప్రభుత్వం మొండిగా వ్వహరిస్తుందని ఆయన విమర్శించారు. గత సంవత్సరం 10 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగాయని, వీటికి 2028 మళ్లీ ఎన్నికలు జరగవలసి ఉంది అన్నారు. అప్పుడే ఏర్పడిన ప్రభుత్వాలు ఒక సంవత్సరం లేదా అంతకంటే తక్కువ సమయం మాత్రమే అధికారంలో ఉంటాయన్నారు. హిమాచల ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, కర్ణాటక, తెలంగాణ, మిజోరాం, మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్, రాజస్థాన్ రాష్ట్రాలలో పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.కేంద్ర ప్రభుత్వం తక్షణమే తన నిర్ణయాన్ని మార్చుకొని మెజార్టీ ప్రజల, రాజకీయ పార్టీల నిర్ణయాన్ని గౌరవించాలని కోరారు.