దత్తాత్రేయ స్వామి ఆశీస్సులతో సర్వం సుభిక్షంగా ఉండాలి
calendar_today
September 18, 2024
person
meenewstelugu
దత్తాత్రేయ స్వామి ఆశీస్సులతో సర్వం సుభిక్షంగా ఉండాలి
అన్ని దానాల కన్నా అన్నసమర్పణగొప్పది.
మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్
తాండూరు మీ:: (న్యూస్ ప్రతినిధి) దత్తాత్రేయ కరుణా కటాక్షాలతో సర్వం సుభిక్షంగా ఉండాలని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్ పేర్కొన్నారు.బుధవారం
పౌర్ణమి సందర్భంగా ఘంగాపూర్ లో వెలిసిన శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్,
జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు వేదమంత్రో చ్ఛరణాలతో ఆశీర్వదించి మరేన్నో ఉత్తమ పదవులు చేపట్టాలని మనసారా ఆశీర్వదించి తీర్ధ ప్రసాదా లను అందజేస్తూ ఘనంగా సన్మానించారు.
పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నసమర్పణ నిర్వహించారు .ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్ మాట్లాడుతూ పౌర్ణమి పురష్కరించుకొని అన్నసమర్పణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అన్ని దానాలకన్నా అన్నసమర్పణ గొప్పదన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు.ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవర్చు కోవాలని సూచించారు. ప్రతి నెల పౌర్ణమి రోజు శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకో వడం జరుగుతుందని వెల్లడించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు తదితరులు ఉన్నారు.